సబ్సిడీపై డ్రోన్లు: శంకర్
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:42 PM
రాష్ట్ర ప్రభు త్వం సబ్సిడీపై ఇస్తు న్న డ్రోన్లను సానివాడ గ్రామంలో సోమ వారం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారం భించారు.
శ్రీకాకుళం రూరల్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తు న్న డ్రోన్లను సానివాడ గ్రామంలో సోమ వారం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారం భించారు. అలాగే మ్యాజిక్ డ్రైన్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం పిఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో ఇంకుడు గొయ్యిల మాదిరిగా మ్యాజిక్ డ్రైన్ నిర్మాణాలు ప్రారంభించామని, వీటితో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలన్నారు. రైతులకు కావాల్సిన పనిముట్లను సబ్సిడీపై అందిస్తున్నామని వీటిని సద్వినియోగం చేసుకోవా లన్నారు. కిష్టప్పేట, తండేంవలస, సానివాడల్లో మూడు డ్రోన్లు అందజేసి నట్లు తెలిపారు. అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.