Share News

లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:04 AM

అరిణాం అక్కివలస జంక్షన్‌ వద్ద జాతీయరహదారిపై శుక్ర వారం లారీ క్యాబిన్‌లో డ్రైవర్‌ ఇరుక్కుపోయాడు. ఆయన్ను యంత్రంసాయంతో బయటకు తీసి ఆస్పత్రికితరలించారు.

 లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌
డ్రైవర్‌ భవేష్‌ను బయటకు తీస్తున్న దృశ్యం :

ఎచ్చెర్ల,అక్టోబరు 24(ఆంధ్రజ్యో తి): అరిణాం అక్కివలస జంక్షన్‌ వద్ద జాతీయరహదారిపై శుక్ర వారం లారీ క్యాబిన్‌లో డ్రైవర్‌ ఇరుక్కుపోయాడు. ఆయన్ను యంత్రంసాయంతో బయటకు తీసి ఆస్పత్రికితరలించారు. పోలీ సుల కథనం మేరకు.. ఇసుకను తీసుకువెళ్లేందుకు విజయనగరం నుంచి రెండు లారీలు శ్రీకాకుళం వస్తుండగా అరిణాం అక్కివలస జంక్షన్‌ వద్ద ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా నిలపడంతో వెనుక వస్తున్న మరో లారీ బలంగా ఢీకొంది. దీంతో వెనుక లారీలో ఉన్న అనకాపల్లి జిల్లా సబ్బవరం సమీపంలోని మల్లునాయుడు పాలేనికి చెందిన డ్రైవర్‌ గంధి భవేష్‌ గాయపడి క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. ఆయన్ను క్రేన్‌ సాయంతో బయటకు తీసి 108లో చికిత్స నిమిత్తం శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన రెండు లారీలు ఒకే వ్యక్తికి చెందినవి. ఈమేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 25 , 2025 | 12:04 AM