Share News

Minister achhenna: రూ.100కోట్లతో 160గ్రామాలకు తాగునీరు

ABN , Publish Date - Jul 20 , 2025 | 11:59 PM

₹100 crore water project సంతబొమ్మాళి మండలంలో 160 గ్రామాలకు రూ.100 కోట్ల వ్యయంతో ఇంటింటికీ తాగునీరు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

Minister achhenna: రూ.100కోట్లతో 160గ్రామాలకు తాగునీరు
టీడీపీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • - గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించండి

  • - మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

  • కోటబొమ్మాళి, జూలై 20(ఆంధ్రజ్యోతి) : సంతబొమ్మాళి మండలంలో 160 గ్రామాలకు రూ.100 కోట్ల వ్యయంతో ఇంటింటికీ తాగునీరు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన ఆదివారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో సంతబొమ్మాళి మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘కూటమి ఏడాది పాలనలో సంక్షేమ పథకాల అమలుతోపాటు అభివృద్ధి కార్యక్రమాలెన్నో చేపట్టాం. రెండేళ్లలో అన్ని గ్రామాలకు మౌలిక వసతులు కల్పిస్తాం. త్వరలో లక్షకుపైగా వితంతువు పింఛన్లు అందజేస్తాం. గత ప్రభుత్వ వైఫల్యాలతోపాటు ప్రస్తుత అభివృద్ధిని ప్రజలకు వివరించాలి. నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. వైసీపీ నాయకుల అసత్యప్రచారాలను తిప్పికొట్టాల’ని పిలుపునిచ్చారు. పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు.

  • అలాగే ప్రజాదర్బార్‌లో భాగంగా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి వినతులను మంత్రి అచ్చెన్న స్వీకరించారు. ఇళ్లు, స్థలాలు, పింఛన్లు మంజూరు చేయాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందజేయాలని పలువురు వినతిపత్రాలు అందజేశారు. టెక్కలి నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకులు తమ ప్రాంత సమస్యలను వివరించారు. విడతల వారీ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి అచ్చెన్న హామీ ఇచ్చారు. అలాగే ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌.ఈశ్వరరావు.. మంత్రి అచ్చెన్నను మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - Jul 20 , 2025 | 11:59 PM