Share News

medical student: కల చెదిరి.. కన్నీరు మిగిలి..

ABN , Publish Date - May 24 , 2025 | 12:14 AM

Medical student suside పేదలకు వైద్యం అందించేలా తమ బిడ్డలను డాక్టర్లుగా చేయాలని ఆ తల్లిదండ్రులు ఉన్నతంగా చదివించారు. ముగ్గురు బిడ్డల్లో ఇద్దరు వైద్యవిద్యను అభ్యసించగా.. మరొకరు సాఫ్ట్‌వేర్‌లో రాణిస్తున్నారు. కాగా.. ఒక కుమారుడు మరో ఏడాదిలోనే పీజీ పూర్తిచేసి.. వైద్యుడిగా వస్తాడని మురిసిపోయిన ఆ తల్లిదండ్రులకు విషాదమే మిగిలింది.

medical student: కల చెదిరి.. కన్నీరు మిగిలి..
రోదిస్తున్న మోతీలాల్‌ కుటుంబ సభ్యులు, బంధువులు

  • - వైద్య విద్యార్థి ఆత్మహత్య

  • - జగన్నాఽథపురంలో విషాదఛాయలు

  • టెక్కలి, మే 23(ఆంధ్రజ్యోతి): పేదలకు వైద్యం అందించేలా తమ బిడ్డలను డాక్టర్లుగా చేయాలని ఆ తల్లిదండ్రులు ఉన్నతంగా చదివించారు. ముగ్గురు బిడ్డల్లో ఇద్దరు వైద్యవిద్యను అభ్యసించగా.. మరొకరు సాఫ్ట్‌వేర్‌లో రాణిస్తున్నారు. కాగా.. ఒక కుమారుడు మరో ఏడాదిలోనే పీజీ పూర్తిచేసి.. వైద్యుడిగా వస్తాడని మురిసిపోయిన ఆ తల్లిదండ్రులకు విషాదమే మిగిలింది. ఏమైందో.. ఏమో.. మెడికల్‌ కళాశాల వసతిగృహంలోనే ఆ కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

  • ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో పీజీ (రేడియాలజీ) విద్యార్థి సింగపురం మోతీలాల్‌ (25) గురువారం హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనది టెక్కలి మండలం జగన్నాథపురం. మోతీలాల్‌కు రాష్ట్రస్థాయిలో నీట్‌లో 10వ ర్యాంక్‌ వచ్చింది. జిప్‌మర్‌ పాండిచ్చేరిలో ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. 2024లో పీజీలో 925వ ర్యాంకు రావడంతో ఆంధ్ర మెడికల్‌ యూనివర్శిటీలో రేడియాలజీ విభాగంలో మూడు నెలల కిందట చేరారు. వసతిగృహంలో ఉంటూ అక్కడ చదువుతున్నారు. అయితే ఏమి జరిగిందో తెలియదు కానీ గురువారం మెడికల్‌ కళాశాల వసతిగృహంలోనే ఉరేసుకున్నారు. అంతవరకూ స్నేహితులతో సరదాగా గడిపిన మోతీలాల్‌ ఎందుకిలా చేశాడని వారికి కూడా తెలియని పరిస్థితి. వసతిగృహ నిర్వాహకుల సమాచారం మేరకు పోలీసులు దీనిపై కేసు దర్యాప్తు చేస్తున్నారు. మోతీలాల్‌కు శుక్రవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించగా.. జగన్నాథపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

  • మోతీలాల్‌ తండ్రి సింగుపురం భాస్కరరావు విశ్రాంతి ఉపాధ్యాయుడు. తల్లి భాగ్యం గృహిణి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్దకుమారుడు రాజు సాఫ్ట్‌వేర్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. మోతీలాల్‌ చిన్నకుమారుడు. కుమార్తె సోనిక వైద్యురాలిగా విజయవాడలో పీజీలో చేరింది. దీంతో కుటుంబంలో అందరూ ఉద్యోగులు కావడంతో సంతోషంగా గడపాల్సిన సమయంలో మోతీలాల్‌ ఆత్మహత్యతో విషాదఛాయలు అలుముకున్నాయి. మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి బాగా చదువుకుని.. వైద్యుడిగా సేవలు అందిస్తాడని ఎన్నో కలలు కన్నామని ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయ్యో ఎందుకిలా చేశావంటూ బోరున విలపిస్తున్నారు. గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.

Updated Date - May 24 , 2025 | 12:14 AM