Share News

కాలువలు లైనింగ్‌ లేక.. గుర్రపు డెక్క తొలగించక

ABN , Publish Date - Jul 20 , 2025 | 11:44 PM

మండలంలోని జగన్నాఽథపు రం,గోపినాఽథపురంలోగల 300ఎకరాలకు కృష్ణసాగరం నుంచి నీరందక పోవడంతో అన్నదాతలు ఆందోళనచెందుతన్నారు. ఒడిశాలోని మహేం ద్రతనయ కొండలనుంచి వచ్చేనీరు ఈసాగరంలోకి చేరుతుంది. అయితే ఏళ్ల తరబడి కాలువల లైనింగ్‌ లేకపోవడంతోపాటు సాగరంలో గుర్రపు డెక్క తొలగించకపోవడంతో సాగరంలోకి నీరు పూర్తిస్థాయిలో చేరడం లేదు.కొండల నుంచి నీరువచ్చే నాలుగుకిలోమీటర్ల పొడవునా కాలువలు అధ్వానంగా మారాయి.

కాలువలు లైనింగ్‌ లేక.. గుర్రపు డెక్క తొలగించక
జగన్నాఽథపురం వద్ద కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్క :

మెళియాపుట్టి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జగన్నాఽథపు రం,గోపినాఽథపురంలోగల 300ఎకరాలకు కృష్ణసాగరం నుంచి నీరందక పోవడంతో అన్నదాతలు ఆందోళనచెందుతన్నారు. ఒడిశాలోని మహేం ద్రతనయ కొండలనుంచి వచ్చేనీరు ఈసాగరంలోకి చేరుతుంది. అయితే ఏళ్ల తరబడి కాలువల లైనింగ్‌ లేకపోవడంతోపాటు సాగరంలో గుర్రపు డెక్క తొలగించకపోవడంతో సాగరంలోకి నీరు పూర్తిస్థాయిలో చేరడం లేదు.కొండల నుంచి నీరువచ్చే నాలుగుకిలోమీటర్ల పొడవునా కాలువలు అధ్వానంగా మారాయి. దీంతో ఖరీఫ్‌లో సైతం ఆయకట్టుకు నీరందడం లేదని రైతులు వాపోతున్నారు. కొద్దేళ్లుగా కృష్ణసాగరానికి కనీస మరమ్మ తులు లేకపోవడం, పూడిక పేరుకుపోవడంతో నీటినిల్వ సామర్థ్యం తగ్గడం వల్ల ఖరీఫ్‌లో సైతం ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందడం లేదని రైతులు వాపోతున్నారు. కనీసం ఉపాధిహామీ పథకం నిధులతో నైనా కాలువల్లో గుర్రపు డెక్క, పూడిక తొలగించాలని అధికారులను కోరినా చర్యలు తీసుకోవడంలేదని జగన్నాఽథపురం గ్రామానికి చెందిన వట్టుకుళ్లు చక్రవర్తి తదితరులు తెలిపారు. ఇప్పటికైనా కాలువలు పూడిక తొలగించి కృష్ణసాగరం ఆయకట్టుకు నీరందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Jul 20 , 2025 | 11:44 PM