Share News

DMHO: డీఎంహెచ్‌వోగా డా.అనిత బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Apr 11 , 2025 | 11:36 PM

Health Department జిల్లా నూతన వైద్యారోగ్యశాఖాధికారిగా డాక్టర్‌ కె.అనిత శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గత డీఎంహెచ్‌వో డాక్టర్‌ బాలమురళీకృష్ణ ఇటీవల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.

DMHO: డీఎంహెచ్‌వోగా డా.అనిత బాధ్యతల స్వీకరణ
డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించిన డా.అనిత

  • అరసవల్లి, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): జిల్లా నూతన వైద్యారోగ్యశాఖాధికారిగా డాక్టర్‌ కె.అనిత శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గత డీఎంహెచ్‌వో డాక్టర్‌ బాలమురళీకృష్ణ ఇటీవల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో ఆయన స్థానంలో డాక్టర్‌ అనితను డీఎంహెచ్‌ వోగా నియమిస్తూ డైరెక్టర్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ నుంచి ఉత్తర్వులు అందాయి. డా.అనిత ఇంతవరకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్‌)లో సీఎస్‌ ఆర్‌ఎంవోగా పనిచేశారు. డీఎంహెచ్‌వోగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు చేపట్టారు.

Updated Date - Apr 11 , 2025 | 11:36 PM