Share News

రైతుల ఇబ్బందులు పట్టవా?

ABN , Publish Date - Aug 26 , 2025 | 11:44 PM

రైతుల ఇబ్బందులు పట్టవా? అని అమలకుడియా సర్పంచ్‌ కొర్ల శిరీష, కిష్టుపురం ఎంపీటీసీ సభ్యుడు మోహన్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిఽధులు అధికారులను ప్రశ్నిం చారు.

రైతుల ఇబ్బందులు పట్టవా?
నిరసన తెలుపుతున్న ప్రజాప్రతినిధులు

- ఎరువులు ఇవ్వడం లేదు

- సాగునీరు అందడం లేదు

- మండల సమావేశంలో సభ్యుల నిరసన

పలాసరూరల్‌, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): రైతుల ఇబ్బందులు పట్టవా? అని అమలకుడియా సర్పంచ్‌ కొర్ల శిరీష, కిష్టుపురం ఎంపీటీసీ సభ్యుడు మోహన్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిఽధులు అధికారులను ప్రశ్నిం చారు. మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ ఉంగ ప్రవీణ అధ్యక్షతన సాధారణ సమా వేశం నిర్వహించారు. రైతులకు పూర్తిస్థాయిలో ఎరు వులు ఇవ్వడం లేదని, వర్షపు నీరే తప్ప.. వంశధార నీటిని ఇప్పటికీ మండలానికి పూర్తిస్థాయిలో అందించ లేదని, ఇలా అయితే శివారుభూముల పరిస్థితి ఏంటని సర్పంచ్‌ కొర్ల శిరీష, ఎంపీటీసీ సభ్యుడు మోహన్‌, ప్రత్యేక ఆహ్వానితుడు ఉంగ సాయి అన్నారు. మామిడిపల్లి, బొడ్డ పాడు గ్రామాల్లో నీటి ట్యాంకులను ఎందుకు శుభ్రం చేయడం లేదని బొడ్డపాడు ఎంపీటీసీ సభ్యుడు ఎం.పాపారావు ప్రశ్నించారు. పంచా యతీలకు 15వ సంఘం నిధులు వచ్చినా పూర్తిగా ఇవ్వడం లేదని, అఽధికారులు గ్రామాలకు పనుల పర్యవేక్షణకు వచ్చినప్పుడు కనీసం సమాచారం ఇవ్వడం లేదని, నిధులు, సమాచారం లేకపోతే తమకు పదవులు ఎందుకని సభలో నిలబడి వైసీపీ ప్రజాప్రతి నిఽధులు నిరసన వ్యక్తం చేశారు. కనీస సమాధానాలు ఇవ్వకుండా అధికారులు మిన్నకుండిపోవడం ఏమిటని చినంచల ఎంపీటీసీ సభ్యుడు డి.దు ర్యోధన ప్రశ్నించారు. రెంటికోట రైతు సేవా కేంద్రం పనులు పూర్తి చేయాలని ఆ గ్రామ సర్పంచ్‌ ఎస్‌.తిరుమలరావు కోరారు. కార్యక్ర మంలో ఎంపీడీవో ఎన్‌.వసంత్‌కుమార్‌, ఈవోపీఆర్‌డీ మెట్ట వైకుంఠ రావు, వైస్‌ఎంపీపీ టి.శ్రీరాములు, జడ్పీటీసీ సభ్యురాలు మచ్చ రత్నాలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 11:44 PM