Share News

కోర్టుల్లో కొలువుల కోసం దళారులను ఆశ్రయించవద్దు

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:26 AM

కోర్టుల్లో కొలువుల కోసం అభ్యర్థులు దళారులను ఆశ్రయించవద్దని జిల్లా ప్రధాన న్యాయాధికారి జూనైద్‌ అహ్మద్‌ మౌలానా అన్నారు.

కోర్టుల్లో కొలువుల కోసం దళారులను ఆశ్రయించవద్దు

- జిల్లా ప్రధాన న్యాయాధికారి జూనైద్‌ అహ్మద్‌ మౌలానా

శ్రీకాకుళం లీగల్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కోర్టుల్లో కొలువుల కోసం అభ్యర్థులు దళారులను ఆశ్రయించవద్దని జిల్లా ప్రధాన న్యాయాధికారి జూనైద్‌ అహ్మద్‌ మౌలానా అన్నారు. సోమవారం ఆయన చాంబర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జిల్లాలోని కోర్టుల్లో పలు ఉద్యోగాల ఎంపికకు ఈనెల 20 నుంచి 24 వరకు రాత పరీక్ష నిర్వహిస్తాం. ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీకాకుళం, రాజాం, నరసన్నపేట కేంద్రాల్లో ఈ పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉంటుంది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా దళారుల అవతారమెత్తితే నాకు ఫిర్యాదు చేయండి.’ అని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లాన్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, శాశ్వత లోక్‌అదాలత్‌ న్యాయాధికారి సువర్ణరాజు పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 12:26 AM