సమస్యలపై జాప్యం చేయొద్దు
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:10 AM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన దరాఖాస్తులపై అర్జీదా రుడు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి జిల్లా పోలీసు అధికారు లకు ఆదేశించారు.

ఎస్పీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన దరాఖాస్తులపై అర్జీదా రుడు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి జిల్లా పోలీసు అధికారు లకు ఆదేశించారు. సో మవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(మీకోసం) కార్యాక్రమంలో 52 మంది నుంచి వినతులను ఎస్పీ స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. అర్జీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై పారదర్శకంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు.