పాఠశాలను తరలించొద్దు
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:46 PM
కృష్ణాపురం మునిసిపల్ ప్రాథమిక పాఠ శాలను తరలించవద్దని గ్రామ స్థులు కోరారు.
ఆమదాలవలస, జూలై 11 (ఆంధ్రజ్యోతి): కృష్ణాపురం మునిసిపల్ ప్రాథమిక పాఠ శాలను తరలించవద్దని గ్రామ స్థులు కోరారు. ఈ మేరకు శుక్రవారం పాఠశాల ఆవరణ లో విద్యార్థులతో కలిసి వారి తల్లిదండ్రులు నిరసన తెలి పారు. ప్రైమరీ పాఠశాలను ఫౌండేషన్ స్కూల్‌గా మార్పు చేయవద్ద న్నారు. పాఠశాలను తరలిస్తే సహించేది లేదన్నారు. పాఠశాలలో కనీసం 12 మంది విద్యార్థులుండాలని నిబంధనలు చెబుతున్న అధికారులు ఇక్కడ సుమారు 21 మంది విద్యార్థులుంటే వారందరినీ చిన్న కృష్ణాపురం ప్రభుత్వ పాఠశాలకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణం ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.