మా పాఠశాలను తరలించొద్దు
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:20 AM
మా గ్రామం లోని పాఠశాలను తరలించ వద్దని గాజులకొల్లివలస గ్రామ స్థులు ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ను వేడుకున్నారు.
ఎమ్మెల్యే రవికుమార్‌ను వేడుకున్న గాజులకొల్లివలస గ్రామస్థులు
ఆమదాలవలస, జూన్ 27(ఆంధ్రజ్యోతి): మా గ్రామం లోని పాఠశాలను తరలించ వద్దని గాజులకొల్లివలస గ్రామ స్థులు ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ను వేడుకున్నారు. ఈ మేరకు శుక్రవారం పట్టణంలో ని టీడీపీ కార్యాలయంలో నిర్వ హించిన ప్రజాదర్బార్‌లో ఎ మ్మెల్యే పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా గాజులకొల్లివలస గ్రామపెద్ద మెండేటి కర్మారావు ఆధ్వర్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎమ్మె ల్యేను కలిసి వినతిపత్రం అందించారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో ఎంతో మంది చుదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నారు. 30 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను కేవలం ఆరుగురు విద్యార్థులు ఉన్న ఆర్‌అండ్‌ఆర్ కాలనీ పాఠశాలలో విలీ నం చేమొద్దన్నారు. కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినని చంద్రశేఖర్, ఎంపీటీసీ అన్నెపు భాస్కరరావు, కూన ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని పదో వార్డు హడ్కో కాలనీకి చెందని నాగళ్ల మురళీధర్ బీసీ సంక్షేమ సం ఘం యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులు కావడంతో అతడిని ఎమ్మెల్యే రవికుమార్ సత్కరించారు. పలువురు కూటమి నేతలు శుభాకాంక్షలు తెలిపారు.