దళారుల బారినపడి మోసపోకండి: అశోక్
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:27 PM
ధాన్యం సేకరణ విషయంలో రైతులు దళారుల బారిన పడి మోసపోవద్దని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నారు.
సోంపేట, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ధాన్యం సేకరణ విషయంలో రైతులు దళారుల బారిన పడి మోసపోవద్దని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నారు. వ్యవసాయశాఖ కార్యాలయంలో శనివారం ధాన్యం సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి 24 గంటల్లోగా నగదును రైతుల ఖాతాల్లో జమచేస్తుందన్నారు. కార్యక్ర మంలో ఏవో బి.నరసింహమూర్తి, తహసీల్దార్ బి.అప్పలస్వామి, నేతలు మద్దిల నాగేశ్వరరావు, చిత్రాడ శ్రీనివాసరావు, బిన్నల జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం
కవిటి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నారు. కవిటిలో ఎస్‌వీజే కళాశాలలో శనివారం స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించారు. జాబ్‌మేళాలను ఉపయోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా 162 మంది యువతీ, యువకులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ యు.సాయికుమార్, కళాశాల సిబ్బంది, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.