మాదక ద్రవ్యాల బారిన పడొద్దు
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:46 PM
యువత డ్రగ్స్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కోరుతూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం రైల్వేస్టేషన్ జంక్షన్ నుంచి వన్‌వే జంక్షన్ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ, అనంతరం మానవహారం నిర్వహించారు.
ఆమదాలవలస, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): యువత డ్రగ్స్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కోరుతూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో శని వారం రైల్వేస్టేషన్ జంక్షన్ నుంచి వన్‌వే జంక్షన్ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ, అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విజిలెన్స్, మోనటరింగ్ కమిటీ సభ్యుడు తాళాబత్తుల ధనుంజయరావు మాట్లాడుతూ.. పుట్టినరోజులు, విందు, వినోదం పేరుతో యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలవుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. దీనివల్ల వారి భవిష్యత్ నాశనమవుతుందన్నారు. ఏఎస్‌ఐ గోపాలకృష్ణ మాట్లాడుతూ.. టెక్నాలజీ కారణంగా కొన్ని గంజాయి బ్యాచ్‌లు పోలీసులకు పట్టుబడ కుండా తిరుగు తున్నప్పటికీ వారిపై నిఘా కొనసాగుతుందన్నారు.