వృత్తిదారులను ఇబ్బందిపెట్టొదు
ABN , Publish Date - May 24 , 2025 | 12:07 AM
కుల వృత్తి చేసుకుని జీవనం సాగిస్తున్న తమను ఇబ్బందిపెట్టొద్దని బలగ ప్రాంతానికి చెందిన పలువురు రజకలు కోరుతున్నారు.
పాత శ్రీకాకుళం, మే 24(ఆంధ్రజ్యోతి): కుల వృత్తి చేసుకుని జీవనం సాగిస్తున్న తమను ఇబ్బందిపెట్టొద్దని బలగ ప్రాంతానికి చెందిన పలువురు రజకలు కోరుతున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రం బలగ ప్రభుత్వ ఆసుపత్రి (రిమ్స్) వెనుక నాగావళి నది ఒడ్డున గత కొన్ని దశాబ్దాలుగా బట్టలు ఉతుకుతూ 200 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. 1990లో వీరి అవసరాల కోసం నది ఒడ్డున గల సుమారు ఐదు ఎకరాల స్థలాన్ని మునిసి పల్ అధికారులు కేటాయించారు. ఈ క్రమంలో కేంద్ర మాజీమం త్రి, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు రూ.7 లక్షలు నిధులు మంజూరు చేశారు. వీటితో దోబీఘాట్, షెడ్, బోర్ వేసి విద్యుత్ కల్పించుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రజకులకు ఇబ్బంది లేకుం డా ఇందులోని కొంత స్థలంలో మునిసిపల్ అధికారులు పార్కు నిర్మించారు. ఇప్పుడు ఈ పార్కును విస్తరణ పేరులో రజకులకు కేటాయించిన మిగిలిన స్థలంలో రెండు రోజులుగా యంత్రాలతో పనులు చేస్తున్నారు. దీంతో గత రెండు రోజులుగా రజకులు ఈ పనులను అడ్డుకుని నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో కలెక్ట ర్, ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్, మునిసిపల్ ఇంజనీర్స్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. ఏపీ రజక సంక్షేమ అభివృద్ధి కార్పొ రేషన్ డైరెక్టర్స్ వేగులాడ దుర్గారావు, గురజాపు రాము ఈ స్థలాన్ని పరిశీలించి, కార్పొరేషన్ చైర్‌పర్సన్ సి.సావిత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వృత్తినే నమ్ముకునే వృత్తిదారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఆమె ఇచ్చారన్నారు.