Share News

రైతులను ఇబ్బందిపెట్టొద్దు: జేసీ ఫర్మాన్‌

ABN , Publish Date - Dec 04 , 2025 | 12:02 AM

ధాన్యం కొనుగొలులో రైతులకు ఇబ్బం దులు లేకుండా చూడాలని జా యింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ అన్నారు.

 రైతులను ఇబ్బందిపెట్టొద్దు: జేసీ ఫర్మాన్‌
ట్రక్‌షీట్స్‌ నమోదును పరిశీలిస్తున్న జేసీ అహ్మద్‌ఖాన్‌

కోటబొమ్మాళి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగొలులో రైతులకు ఇబ్బం దులు లేకుండా చూడాలని జా యింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ అన్నారు. బుధవారం ఆయన చీపుర్లపాడు, జర్జంగి రైతు సేవాకేంద్రాలతో పాటు కోటబొమ్మాళిలో బోయిన ద్వారక రైస్‌మిల్లు, నిమ్మాడలోని వెంకటేశ్వర రైస్‌మిల్లులను టెక్కలి సబ్‌ కలెక్టర్‌ కృష్ణమూర్తితో కలిసి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, ట్రక్‌షీట్ల నమోదులో ఆలస్యంపై స్బిబందిని ప్రశ్నించారు. ఎలాంటి అవకతవకలు లేకుండా ధా న్యం కొనుగోలు సజావుగా చేపట్టాలన్నారు. రైతులకు ధాన్యం కొనుగోలు చేసిన నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని ఆయన తెలిపారు. తహసీల్దార్‌ అప్పలరాజు, ఆర్‌ఐ పవిత్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 04 , 2025 | 12:02 AM