Share News

మార్కెట్‌ తరలింపుపై అపోహలు వద్దు

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:08 AM

ww

 మార్కెట్‌ తరలింపుపై అపోహలు వద్దు
అరసవల్లి: వ్యాపారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌:

అరసవల్లి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్‌ తరలింపుపై ఎవరూ ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. బుధవారం శ్రీకాకుళంలోని 80అడుగుల రోడ్డులో గల జిల్లా టీడీపీ కార్యాలయంలో వ్యాపారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్ద మార్కెట్‌లో వ్యాపారుల జాబితా తయారైన తర్వాతే ప్రణాళిక ప్రకారం నిర్మాణానికి ముందుకు వెళ్తామని తెలిపారు. తుది జాబితాలో ఉన్న వ్యాపారులందరికీ స్థలాల కేటాయంపుపై కలెక్టర్‌ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తరువాతనే మార్కెట్‌ను తరలిస్తామన్నారు. వైసీపీ నాయకులు ఐదేళ్లపాటు మార్కెట్‌ను పట్టించుకోలేదని, వారి సవతితల్లి ప్రేమను నమ్మవద్దని హితవు పలికారు. కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షుడు కోరాడ హరగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి తక్షణ పరిష్కారానికి కృషి చేయడమే ప్రజాదర్బార్‌ లక్ష్యమని ఎమ్మెల్యే గొండుశంకర్‌ తెలిపారు. స్థానిక 80 అడుగుల రోడ్డులో గల టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ప్రజాదర్బార్‌ నిర్వహించి వినతులను స్వీకరించారు.

Updated Date - Apr 10 , 2025 | 12:08 AM