కార్గో ఎయిర్‌పోర్టుపై అపోహవద్దు: ఆర్డీవో
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:06 AM
:కార్గో ఎయి ర్‌పోర్టు నిర్మాణంపై అపోహలు వద్దని పలాస ఆర్డీవో జి.వెంకటేష్, ఎయిర్‌పోర్టు లీగల్ అడ్వైజర్ ఎం.వెంకటేశ్వర రావు కోరారు. సోమవారం మందస తహసీల్దార్ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ వెనకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వంఎయిర్‌పోర్టు నిర్మించేందుకు నిర్ణయం తీసుకుందని, దీంతో చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి,ఉద్యోగావకాశాలు పెరుగుతాయని తెలిపారు.
మందస, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి):కార్గో ఎయి ర్‌పోర్టు నిర్మాణంపై అపోహలు వద్దని పలాస ఆర్డీవో జి.వెంకటేష్, ఎయిర్‌పోర్టు లీగల్ అడ్వైజర్ ఎం.వెంకటేశ్వర రావు కోరారు. సోమవారం మందస తహసీల్దార్ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ వెనకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వంఎయిర్‌పోర్టు నిర్మించేందుకు నిర్ణయం తీసుకుందని, దీంతో చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి,ఉద్యోగావకాశాలు పెరుగుతాయని తెలిపారు.ఎయిర్‌పోర్టు ప్రభావిత గ్రామాల్లో పర్యటించి గ్రామసభలు నిర్వహిస్తామని, దీనివల్ల కలిగే లాభనష్టాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో ప్రజాభిప్రాయ సేకవరణ జరుగుతుందన్నారు. మెట్టూరు,చీపురుపల్లి, బిడిమి గ్రామాల్లో 95శాతం, మిగతా గ్రామాల్లో 5శాతం ఎయిర్‌పోర్టు నిర్మించనున్నట్లు తెలిపారు. మిగతా ప్రభావిత గ్రామాల్లో గృహాలకు ఎటువంటి నష్టం వాటిల్లదన్నారు. వ్యవసాయభూమి 1000 ఎకరాలు, ప్రభుత్వ భూమి 200 ఎకరాలకుపైగా భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మందస తహశీల్దార్ మిస్క శ్రీకాంత్, సర్వేయరు బాబూరావు, ఆర్‌ఐ ఇందిర పాల్గొన్నారు.