విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దు
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:41 PM
విధినిర్వహణలో అలసత్వం వహించే వారిపై చర్యలుతప్పవని టెక్కలి డీఎల్‌డీవో అరివేలు మంగమ్మ తెలిపారు.
కోటబొమ్మాళి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): విధినిర్వహణలో అలసత్వం వహించే వారిపై చర్యలుతప్పవని టెక్కలి డీఎల్‌డీవో అరివేలు మంగమ్మ తెలిపారు. గురువారం కోటబొమ్మాళి పంచాయతీ పరిధిలోని సచివాలయా లను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను ఎంతవరకు పూర్తిచేశారో చెప్పాలని సచివాలయ సిబ్బంది ప్రశ్నించారు. దీంతో సచివాలయాల సిబ్బంది ఏమీ చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేలు, ఈ-కేవైసీలు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో తమకు చెప్పాలని సిబ్బందిని నిలదీశారు. ఇక నుంచి రోజు ఎంతమందికి ఈకేవైసీ చేస్తున్నారో ఏ రోజుకారోజు డేటా గ్రూప్‌లో పెట్టాలని ఆమె సూచిం చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చింతాడ సన్యాసిరావు, వీఆర్వో రంగస్వామి పాల్గొన్నారు. ఙ