Share News

డొమస్టిక్‌ గ్యాస్‌ వినియోగాన్ని అరికట్టాలి

ABN , Publish Date - Oct 06 , 2025 | 11:59 PM

రెస్టారెంట్లు, హోటళ్లలో కమర్షియల్‌ గ్యాస్‌ వినియోగించేలా, డొమస్టిక్‌ గ్యాస్‌ వినియోగాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగ పోరాటసమితి నాయకులు టి.సూర్యం, బి.గోవిందరావు, కె.జోగారావు, ఎ.అప్పన్న, బి.గౌతం కోరారు.ఈమేరకు సోమవారం టెక్కలిలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తికి వినతిపత్రం అందజేశారు

డొమస్టిక్‌ గ్యాస్‌ వినియోగాన్ని అరికట్టాలి
ఆర్డీవోకు వినతిపత్రం ఇస్తున్న ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగ పోరాటసమితి నాయకులు

టెక్కలి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): రెస్టారెంట్లు, హోటళ్లలో కమర్షియల్‌ గ్యాస్‌ వినియోగించేలా, డొమస్టిక్‌ గ్యాస్‌ వినియోగాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగ పోరాటసమితి నాయకులు టి.సూర్యం, బి.గోవిందరావు, కె.జోగారావు, ఎ.అప్పన్న, బి.గౌతం కోరారు.ఈమేరకు సోమవారం టెక్కలిలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమర్షియల్‌ గ్యాస్‌ వినియోగం వల్ల ప్రమాదాలు నివారించవచ్చని, తద్వారా ప్రభు త్వానికి ఆదాయంకూడా ఆదా అవుతుందని తెలిపారు.హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ దుకాణాల్లో డొమస్టిక్‌ గ్యాస్‌ వినియోగంపై విచారణ నిర్వహించాలని కోరారు.

Updated Date - Oct 06 , 2025 | 11:59 PM