Share News

సమస్యలు పరిష్కరించాలని వైద్యుల వినతి

ABN , Publish Date - Sep 30 , 2025 | 11:34 PM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహి స్తున్న వైద్యాధికారుల సమస్యలు పరిష్కరించా లని నియోజకవర్గం పరిధిలోని వైద్యాధికారులు కోరారు.

సమస్యలు పరిష్కరించాలని వైద్యుల వినతి
ఆమదాలవలస: ఎమ్మెల్యే రవికుమార్‌కు వినతిపత్రం అందిస్తున్న వైద్యులు

ఆమదాలవలస, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహి స్తున్న వైద్యాధికారుల సమస్యలు పరిష్కరించా లని నియోజకవర్గం పరిధి లోని వైద్యాధికారులు కోరారు. ఈ మేరకు మంగ ళవారం ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ను కలిసి వినతి పత్రం అందించారు. సరు బుజ్జిలి, పురుషోత్త పురం, బూర్జ, గుత్తావల్లి, అక్కులపేట, తొగరాం, దూసి, పట్టణంలోని పలు అర్బన్‌ ఆరో గ్య కేంద్రాల వైద్యులు ఎమ్మె ల్యేని శ్రీకాకుళంలోని ఆయన స్వగృ హంలో కలిసి సమస్యలను విన్నవించారు. వైద్యవృత్తిలో ఉన్నత చదువులు చదివి భవి ష్యత్‌లో స్థిరపడాలన్న మా ఆలోచనకు ప్రభుత్వం విధించిన నిబం ధనలు ఇబ్బందిగా ఉన్నాయన్నారు. గ్రామీణ పీహెచ్‌సీ ల్లో విధులు నిర్వహిస్తూ వైద్య సేవలు అందిస్తున్న మా సమ స్యలను వైద్య ఆరోగ్యశాఖా మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్క రించేందుకు సహకరించాలని కోరారు. దీనికి ఎమ్మెల్యే సాను కూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు.

డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద వైద్యుల నిరసన

అరసవల్లి. సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ వైద్యులకు జరుగు తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా మంగళవారం డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట వైద్యులు నిరసన తెలిపారు. ఇన్‌ సర్వీస్‌ పీజీ కోటా పునరుద్ధరించాలని, టైమ్‌బౌండ్‌ ప్రమోషన్లు ఇవ్వాలని, నోషనల్‌ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, సంచార చికిత్స కార్యక్రమానికి నెలకు రూ.5 వేలు ఇన్సెంటివ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 11:34 PM