మంజూరుచేసిన పనులే చేయండి
ABN , Publish Date - May 15 , 2025 | 12:03 AM
మంజూరు చేసిన పనులు మాత్రమేచేయాలని, అలాకాకుండా మంజూరు కాకుండా ముందస్తుగా పనులు చేస్తున్నట్లు తెలుస్తోందని, అలా చేస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని కేంద్ర జలశక్తి అభి యాన్ నోడల్ అధికారి సుగుణాకర రావు హెచ్చరించారు.
మెళియాపుట్టి, మే 14( ఆంధ్ర జ్యోతి): మంజూరు చేసిన పనులు మాత్రమేచేయాలని, అలాకాకుండా మంజూరు కాకుండా ముందస్తుగా పనులు చేస్తున్నట్లు తెలుస్తోందని, అలా చేస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని కేంద్ర జలశక్తి అభి యాన్ నోడల్ అధికారి సుగుణాకర రావు హెచ్చరించారు. బుధవారం మెళియాపుట్టి, గోకర్ణపురం గ్రామాల్లో ఉపాధి నిధులతోచేస్తున్న నీటికుంట ల పనులను కేంద్ర బృందం పరిశీ లించింది. ఈసందర్భంగా మాట్లాడుతూ పనులు గుర్తించిన సమయంలో ఎక్కడైతే జీపీఎస్ చేస్తారో అక్కడే పనులు చేయలని కోరారు. అలా కాకుండా వేరే చోట్ల పనులు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధి అధికారులు శోభ, రవి, ఆదినాయుడు, చాణ్యక్య,తదితరులు పాల్గొన్నారు