విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దు
ABN , Publish Date - May 27 , 2025 | 12:15 AM
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్ద, లేకుంటే మోదీ ప్రభుత్వం తగిన మూ ల్యం చెల్లించక తప్పదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అమ్మన్నా యుడు అన్నారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, మే 26(ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్ద, లేకుంటే మోదీ ప్రభుత్వం తగిన మూ ల్యం చెల్లించక తప్పదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అమ్మన్నా యుడు అన్నారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కో సం కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తన కుట్రలు మానుకోవాలన్నారు. ఎంతోమంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ను కార్పొరేట్లకు అప్పగించాలనుకోవడం సరికాదన్నారు. విశాఖ స్టీల్‌కు సొంత గనులను సమకూర్చాలని, సెయిల్‌లో విలీ నం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు జడ్పీ సమా వేశ మందిరంలో నిర్వహస్తున్న గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఎం.ఆదినారాయణమూర్తి, అల్లు సత్యనారాయణ, కె.సూరయ్య, చిక్కాల గోవిందరావు, ఆర్.ప్రకాశరావు, ఎం.గోవర్దన రావు తదితరులు పాల్గొన్నారు.