Share News

ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటుచేయవద్దు

ABN , Publish Date - Dec 31 , 2025 | 12:07 AM

గ్రామానికి సమీపంలో ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటు చేయవద్దని రణస్థలం పంచాయతీ పరిధిలోగల నగరప్పాలేం, బండిపాలేం గ్రామస్థులు నిరసన తెలిపారు. మంగళవారం నగరప్పాలేం గ్రామానికి సమీపాన సంబంధిత ఆర్వో ప్లాంట్‌ యాజమాన్యం ప్లాంట్‌ పనులను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది.

ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటుచేయవద్దు

రణస్థలం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గ్రామానికి సమీపంలో ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటు చేయవద్దని రణస్థలం పంచాయతీ పరిధిలోగల నగరప్పాలేం, బండిపాలేం గ్రామస్థులు నిరసన తెలిపారు. మంగళవారం నగరప్పాలేం గ్రామానికి సమీపాన సంబంధిత ఆర్వో ప్లాంట్‌ యాజమాన్యం ప్లాంట్‌ పనులను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకునే ప్రయత్నంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాల వారికి నచ్చజెప్పారు. అనంతరం సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐ చిరంజీవి రైతులను స్టేషన్‌కు రప్పించి మాట్లాడారు.

Updated Date - Dec 31 , 2025 | 12:07 AM