Share News

అర్జీల పరిష్కారంలో ఆలస్యం చేయొద్దు

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:12 AM

అర్జీల పరిష్కారంలో ఆలస్యం చే యొద్దని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

అర్జీల పరిష్కారంలో ఆలస్యం చేయొద్దు
అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మార్చి 10(ఆంధ్రజ్యోతి): అర్జీల పరిష్కారంలో ఆలస్యం చే యొద్దని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థా నిక జడ్పీ సమావేశ మందిరంలో ఆయన జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 141 అర్జీలను స్వీకరించారు. క్షుణ్ణంగా పరిశీ లించి, అర్జీదారులు సంతృప్తి చెందేలా, అర్జీల ను పరిష్కరించాలని, కారణాలను వారికి తెలి యజేయాలన్నారు. తమ గ్రామంలోని చెరువు ఆక్రమణలు తొలగించాలని కిల్లిపాలెం గ్రామస్థులు కలె క్టర్‌ను కోరారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకటేశ్వరరావు, ఉప కలెక్టర్‌ ప ద్మావతి, జడ్పీ సీఈవో శ్రీధర్‌రాజా, డీఆర్డీఏ పీడీ కిరణ్‌ కుమార్‌, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

కొత్తూరు, మార్చి 10(ఆంధ్రజ్యోతి): వంశధార నిర్వాసిత కాలనీ మెట్టూరు బిట్‌-2 సమస్యలను పరిష్క రించాలని సర్పంచ్‌ యర్లంకి ధర్మారావు ఆధ్వర్యంలో నిర్వాసితులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు.

ఇచ్ఛాపురం: త్వరలో ప్రారంభం కానున్న టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు రాయడానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని మండపల్లి సర్పంచ్‌ పిట్ట శేషమ్మ కలెక్టర్‌ను కోరారు.

పేదరికం లేని సమాజమే ధ్యేయం

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మార్చి 10(ఆంధ్రజ్యోతి): పేదరి కం లేని సమాజమే లక్ష్యంగా పీ-4 విధానం అమలు చే యనున్నట్టు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. సోమవారం స్థానిక జడ్పీ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర విజన్‌-47 డాక్యుమెంట్‌లోని పది సూత్రాల్లో మొదటి సూత్రమైన సంపూర్ణ పేదరిక నిర్మూలన లక్ష్యంగా కార్యాచరణను రూపొందించినట్టు తెలిపారు. ఉగాది నుం చి ఈ కార్యక్రమం అమలు కానుందన్నారు. ఈ కార్యక్ర మంపై ప్రజల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిం చడం జరుగుతుందని, దీనికి సంబంధించిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి లేదా సంబంధిత లింక్‌ ద్వారా ఈ నెల 25వ తేదీ లోగా తమ అభిప్రాయాలు/ సూచనలు తెలియజేయాలని కలెక్టర్‌ కోరారు. చక్కని సూచనలు తెలిపిన వారికి ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరుగు తుందన్నారు. ఈ మేరకు అధికారులతో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉప కలెక్టర్‌ పద్మావతి, డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, జడ్పీ సీఈవో శ్రీధర్‌ రాజా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 12:12 AM