Share News

ముగిసిన జిల్లాస్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాలు

ABN , Publish Date - Nov 23 , 2025 | 11:35 PM

స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఆదివారం జిల్లాస్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాలు ముగిశాయి. ముందుగా శాస్త్రవేత్తలు సర్‌ సీవీ రామన్‌ ఎల్లాప్రగడ సుబ్బా రావు చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళి అర్పించారు.

ముగిసిన జిల్లాస్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాలు
విజేతలకు బహుమతులు అందజేస్తున్న నిర్వాహకులు

గుజరాతీపేట, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఆదివారం జిల్లాస్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాలు ముగిశాయి. ముందుగా శాస్త్రవేత్తలు సర్‌ సీవీ రామన్‌ ఎల్లాప్రగడ సుబ్బా రావు చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా ప్రభుత్వ పురుషుల, మహిళా డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు పోలి నాయుడు, ఎ.సూర్యచంద్ర రావు మాట్లాడుతూ.. మూఢనమ్మ కాలు లేని శాస్ర్తీయ సమా జ నిర్మాణం కోసం కృషి చేయా లన్నారు. అనంతరం జిల్లా స్థాయి పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక ఎడ్యూకేషన్‌ సబ్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ గొంటి గిరిధర్‌, టెక ్కలి ఉప విద్యాశాఖాధికారి పి.విలియం, డా.ఎం.ప్రదీప్‌, ఎం.ఆదినారాయణ, అర్బన్‌ ఎంఈవో ఎం.సుజాత, బమ్మిడి శ్రీరామూర్తి, వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 11:35 PM