దుబాయ్‌లో జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:48 AM
బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లిన పాలవలస గ్రామానికి చెందిన తామాడ ఓంకార్ (21) అక్కడే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తల్లి నీల వేణి, చిన్నాన్న సోమశేఖర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
దుబాయ్‌లో జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
పాలవలసలో విషాదం
సోంపేట రూరల్, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లిన పాలవలస గ్రామానికి చెందిన తామాడ ఓంకార్ (21) అక్కడే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తల్లి నీల వేణి, చిన్నాన్న సోమశేఖర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలో వెల్డింగ్ పనులు చేసుకుంటూ తల్లిని పోషించుకుంటున్న ఓంకార్‌కు ఆర్థిక ఇబ్బందు లు ఎదురవడంతో ఉపాధి కోసం ఆరు నెలల కిందట దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో ఏసీ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. రోజూ కుటుంబ సభ్యులతో మాట్లాడుతుండేవాడు. అయితే నాలుగు రోజులుగా అతడి నుంచి ఫోన్ రాకపోవడంతో గ్రామస్థులు తోటి కార్మికులను సంప్రదించారు. ఈ నెల 3న ఓంకార్ మృతి చెందినట్టు వారు సమాచారమిచ్చా రు. మృతికి కారణాలు వారి నుంచి స్పష్టంగా తెలియలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతుడి తండ్రి ఐదేళ్ల కిందట మృతి చెందాడు. కాగా మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించాలని ఎమ్మెల్యే అశోక్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రమో హన్ ద్వారా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు ఫ్యాక్స్‌లో బుధవారం వేడు కున్నారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి మృతదేహం రప్పించేందుకు చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చినట్లు ఎంపీటీసీ మాజీ సభ్యులు చెల్లూరు ధర్మ, నాయకులు మన్మఽథరావు, రామదాసు తెలిపారు. కుమారుడి మృతితో ఆ తల్లి ఆవేదన వర్ణణాతీతం. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
క్రీడా పోటీలకు వస్తూ..
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
ఎచ్చెర్ల, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ఫరీద్‌పేట పంచాయతీ కొయ్యరాళ్లు జంక్షన్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. శ్రీకాకుళం నగరంలో జరుగుతున్న క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు విజయనగరం జిల్లా వంగ ర మండలం సంగాం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులను ఆ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బైక్‌పై తీసుకువస్తూ ఫరీద్‌పేట గ్రామానికి చెందిన మరో బైక్‌ను ఢీకొన్నారు. ఈ ఘటనలో అక్కచెల్లెళ్లు అయిన విద్యార్థినులు జి.మణి (9వ తరగతి), జి.ఇందు (8వ తరగతి)తో పాటు ఫరీద్‌పేటకు చెందిన ఓ వ్యక్తి గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్‌లో శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.