Share News

రాష్ట్రస్థాయి చదరంగం పోటీలకు జిల్లా జట్ల ఎంపిక

ABN , Publish Date - Aug 03 , 2025 | 11:38 PM

రాష్ట్రస్థాయి చదరంగం పోటీ లకు జిల్లా జట్ల ఎంపిక పోటీ ఆదివారం నిర్వ హించారు.

రాష్ట్రస్థాయి చదరంగం పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
పోటీల్లో పాల్గొన్న చిన్నారులు

శ్రీకాకుళం స్పోర్ట్స్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి చదరంగం పోటీ లకు జిల్లా జట్ల ఎంపిక పోటీ ఆదివారం నిర్వ హించారు. స్థానిక కొత్తరోడ్డు వద్ద ట్రస్టు కార్యాలయంలో నిర్వహించిన పోటీలకు జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో రేటెడ్‌ క్రీడాకా రుడు బి.యశ్వంత్‌ ప్రఽథమస్థానం పొంద గా బి.జీవన్‌, డి.తారకేశ్వరరావు, జె.సుహాస్‌ వరుస స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో బి.శృతి, ఎం.తీక్షణ, గీతిక విజేతలుగా నిలిచారు. వీరంతా ఈనెల 9, 10వ తేదీల్లో కర్నూలులో జరగ నున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలకు ఆర్బిటార్‌గా సనపల భీమారావు వ్యవహరించారు. విజేతలకు కమిటీ సభ్యులు రామాంజనేయులు, జె.రమేష్‌ తదితరులు బహుమతులు అందజేశారు.

Updated Date - Aug 03 , 2025 | 11:38 PM