జాతీయ కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారులు
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:33 PM
జాతీయ స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికైనట్లు రాష్ట్ర కబడ్డీ సంఘం నుంచి ఆదేశాలు వచ్చాయి.
శ్రీకాకుళం స్పోర్ట్స్, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికైనట్లు రాష్ట్ర కబడ్డీ సం ఘం నుంచి ఆదేశాలు వచ్చాయి. కోటబొమ్మాళి మండలం కొత్తపేటకు చెందిన జీరు చంద్రలేఖ (కెప్టెన్), పాత్రుని గీతిక (కోటబొమ్మాళి), అఖరకండి మేఘన (నందిగాం మండలం నౌగాం) ఎంపికయ్యారు. వీరంతా గురువారం నుంచి 30వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలో జరగ నున్న జాతీయస్థాయి పోటీలకు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. జాతీయ పోటీల్లోనూ రాణించి రాష్ట్రానికి, జిల్లాకు పేరుప్రతి ష్టలు తీసుకురావాలని జిల్లా కబడ్డీ సంఘం చైర్మన్, ఎమ్మెల్యే గొండు శంకర్, అధ్యక్షుడు నక్క రామకృష్ణ, కార్యదర్శి సాధు ముసలినాయుడు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సాధు శ్రీనివాసరావు ఆకాంక్షించి అభినందించారు.
15 నాటికి అందుబాటులోకి టర్ఫ్ వికెట్
శ్రీకాకుళం స్పోర్ట్స్, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): నగరంలోని ఏడురోడ్ల కూడలి సమీపంలో ఉన్న ఎన్టీఆర్ మున్సిపల్ పాఠశాల క్రీడా మైదానంలో మహిళల నెట్ ప్రాక్టీస్‌కు సంబం ధించిన టర్ఫ్ వికెట్ డిసెంబరు 15 నాటికి అందుబాటులోకి రానుందని జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు బుధవారం సంఘం కార్యదర్శి హసన్‌రాజా, మెంటార్ ఇలియాస్ మహ్మ ద్, ట్రెజరర్ శైలాని టర్ఫ్ వికెట్, సిమెంట్ వికెట్ పనితీరును పరిశీలించారు. ఎర్త్ వర్క్ పూర్త యిందని, టర్ఫ్ వికెట్‌కు తగ్గట్టు మట్టిని, వికెట్‌పై వేసే గడ్డిని తెప్పిం చాల్సి ఉంటుందన్నారు. మహిళా క్రికెటర్లను ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మహిళా క్రికెట్ శిక్షకులు హరికా యాదవ్, రమణమ్మ పాల్గొన్నారు.