గోవాలో జిల్లా మత్స్యకారుడి మృతి
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:21 AM
హుకుంపేట గ్రామానికి చెందిన కారి రాజులు (44) గోవాలో చేపల వేటకు వెళ్లి మృతి చెం దాడు.
చేపలవేట చేస్తుండగా పడవ బోల్తా..
వజ్రపుకొత్తూరు, ఆగ స్టు 1(ఆంధ్రజ్యోతి): హుకుంపేట గ్రామానికి చెందిన కారి రాజులు (44) గోవాలో చేపల వేటకు వెళ్లి మృతి చెం దాడు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తె లిపిని వివరాల మేర కు.. స్థానికంగా చేపల వేట సరిగ్గా సాగకపోవ డంతో రాజులు గ్రామ స్థులతో కలిసి గోవాకు వలస వెళ్లాడు. శుక్రవారం సా యంత్రం చేపలవేట కోసం మర పడవ సముద్రంలోకి వెళ్లగా.. అలల తాకిడికి అది బోల్తా పడింది. దీంతో పడ వ కింద ఉండిపోయిన రాజులు చెందాడు. ఈ విష యాన్ని శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులకు సమాచా రం అందింది. రాజులు తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోగా భార్య నాగమ్మ, ఇద్దరు కుమార్తెలు హుకం పేటలో ఉన్నారు. పొట్టకూటికోసం వెళ్లిన రాజులు ప్ర మాదంలో మృతిచెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది, కాగా ఏటా 30 మందివరకు గ్రామం నుంచి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారని గ్రామస్థులు చెబుతున్నారు.