Share News

Distribution of toolsదివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:23 AM

Distribution of tools సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు బుధవారం ఉపకరణాలను పంపిణీ చేశారు.

Distribution of toolsదివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ
ఎల్‌ఎన్‌పేట: దివ్యాంగులకు అందజేసిన పరికరాలతో విద్యాశాఖాధికారులు

హిరమండలం/ఎల్‌ఎన్‌పేట/హరిపురం, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు బుధవారం ఉపకరణాలను పంపిణీ చేశారు. హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, మందస భవిత కేంద్రాల్లో జరిగిన కార్యక్రమంలో వినికిడి యంత్రాలు, వీల్‌చైర్లు, సీపీ చైర్లు అందిం చారు. దివ్యాంగుల్లో మానసిక స్థైర్యం కల్పించాలన్నారు. కార్యక్రమాల్లో ఎంఈవోలు రాంబాబు, సీహెచ్‌ మణికుమార్‌, కె.చంద్రమౌళి, మర్రిపాటి లక్ష్మణరావు, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 12:23 AM