Share News

స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభం

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:26 AM

రాష్ట్రప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియ సోమవారం ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు వీటిని అందించారు.

స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభం
ఆమదాలవలస: స్మార్ట్‌కార్డులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

రాష్ట్రప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియ సోమవారం ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు వీటిని అందించారు.

రేషన్‌ అక్రమాలకు చెక్‌: రవికుమార్‌

ఆమదాలవలస, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): నిత్యావసర సరుకుల పంపణీలో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం స్మార్ట్‌ కార్డులను ప్రవేశ పెట్టిందని ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని 15వ వార్డు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్మార్ట్‌ కార్డులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ క్యూర్‌ ఆధారిత స్మార్ట్‌ రేషన్‌ కార్డు వల్ల పౌర సరఫరాల వ్యవస్థలో పాదరర్శకత తీసుకు రానున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీతాసాగర్‌, తహసీల్దార్‌ ఎస్‌.రాంబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ తమ్మినేని రవి, రాష్ట్ర మెడికల్‌ బోర్డు కౌన్సిల్‌ సభ్యుడు చాపర సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

పారదర్శకంగా ప్రజా పంపిణీ: శంకర్‌

శ్రీకాకుళం రూరల్‌/గార రూరల్‌, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దేం దుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన స్మార్ట్‌ రేషన్‌ కార్డులను శ్రీకాకుళం రూరల్‌ మండలం సింగుపురం, నగర పరిధి కాజీపేట, గార మండలం రామ చంద్రాపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామాల్లో సోమ వారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎస్‌వో సూర్య ప్రకాశరావు, తహసీలార్‌ చక్రవర్తి, ఎంపీడీవో రఘు, టీడీపీ నేతలు మాదారపు వెంకటేష్‌, రాధాకృష్ణారెడ్డి, సింగుపురం సర్పంచ్‌ గుండ అదిత్య నాయుడు, అధికారులు పాల్గొన్నారు.

పథకాలను సద్వినియోగం చేసుకోండి: ఎన్‌ఈఆర్‌

రణస్థలం/లావేరు/జి.సిగడాం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నడుదుకుటి ఈశ్వరరావు అన్నారు. ప్రభుత్వ మంజూరు చేసి న స్మార్ట్‌ రేషన్‌ కార్డులను సోమవారం రావాడ చిన ముర పాక, మెట్టవలస గ్రామాల్లో పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సంక్షేమం తో పాటు అభివృద్ధి పనులను కూడా చేపడుతుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ అద్యక్షుడు చౌదరి అవినాష్‌ తదిత రులు పాల్గొన్నారు.

సంక్షేమం, అభివృద్ధే ధ్యేయం: బగ్గు

జలుమూరు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): సంక్షేమంతో పాటు రాష్ట్రాభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆ దిశగా చంద్రబాబునాయుడు పాలన సాగుతోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. చల్లవానిపేట గ్రామ సచివాలయంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులను సోమవారం పంపిణీ చేశారు. జీవనోపాధి కోసం వలస వెళ్లే కార్మికులకు కూడా ఈ కార్డులు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో జలుమూరు, సారవకోట తహసీల్దార్లు జె.రామారావు, విజయలక్ష్మి, సీఎస్‌డీటీ జాఫర్‌ షరీఫ్‌, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, సర్పంచ్‌ పంచిరెడ్డి రామచంద్రరావు, చల్లవానిపేట, అల్లాడ సొసైటీ చైర్మన్‌లు దుంగ స్వామిబాబు, వెలమల చంద్రభూషణరావు, పార్టీ మండల అధ్యక్షుడు వెలమల రాజేంద్రనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 12:26 AM