Share News

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

ABN , Publish Date - Aug 12 , 2025 | 11:34 PM

నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మంగళవారం తన క్యాంపు కార్యాల యంలో అందజేశారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

రణస్ధలం, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మంగళవారం తన క్యాంపు కార్యాల యంలో అందజేశారు. 25 కుటుంబాలకు రూ.22 లక్షల విలువైన చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి అండగా సీఎం చంద్ర బాబు నాయుడు నిలిచారని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలి పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ చౌదరి అవినాష్‌, లావేరు, జి.సిగడాం, రణస్థలం మండలాల టీడీపీ అధ్యక్షులు ముప్పిడి సురేష్‌, కె.రవికుమార్‌, లంక శ్యామలరావు, కూటమి నాయకులు పిసిని జగన్నాఽ థంనాయుడు, కూనపల్లి దామోదరరావు పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2025 | 11:34 PM