దివ్యాంగులకు కృత్రిమ అవయవాల వితరణ
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:44 PM
చే తన ఫౌండేషన్ (విజ యనగరం) ఆధ్వర్యం లో దివ్యాంగులకు ఉ చితంగా కృత్రిమ అ వయవాలు అందజేశా రు.
పలాస, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): చే తన ఫౌండేషన్ (విజ యనగరం) ఆధ్వర్యం లో దివ్యాంగులకు ఉ చితంగా కృత్రిమ అ వయవాలు అందజేశా రు. స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న షిర్డీ సాయిబాబా ధ్యాన మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లాతోపాటు ఒడిశా రాష్ట్రం గంజాం, గజపతి జిల్లాలకు చెందిన దివ్యాంగులకు వీటిని అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఫౌండర్ కేశవ్‌కృష్ణ మాట్లాడుతూ.. దివ్యాంగులు ఎంతో మంది ఉ న్నారని, వారందరికీ ఉదారంగా సేవచేయడానికి తాము ఫౌండేషన్ ఏర్పాటు చే శామన్నారు. గాయత్రి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ కొర్ల కన్నారావు, గురుదేవ చారిటబుల్ ట్రస్టు, మధర్ వలంటీర్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రతినిధులు, సీతారామ్, సురేష్, మిశ్రా, రాపర్తి జగదీష్ పాల్గొన్నారు.