Money Matters Dispute: వసపలో యువకుడి దారుణ హత్య
ABN , Publish Date - Jul 06 , 2025 | 11:38 PM
Financial argument కొత్తూరు మండలం వసప గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యా డు. పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి విచక్ష ణారహితంగా దాడి చేసి ఆ యువకుడిని చంపేశాడు.
డబ్బుల విషయంలో చెలరేగిన వివాదం
దాడి చేసి చంపేసిన టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు
కొత్తూరు, జూలై 6(ఆంధ్రజ్యోతి): కొత్తూరు మండలం వసప గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యా డు. పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి విచక్ష ణారహితంగా దాడి చేసి ఆ యువకుడిని చంపేశాడు. పోలీసులు, స్థానికులు తెలి పిన వివరాల ప్రకారం.. వసప గ్రామానికి చెందిన లుకలాపు మిన్నారావు(21) అనే యువకుడు వ్యవసాయ పనులు చేస్తుం టాడు. గ్రామంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం ఎదురుగా ఉన్న టిఫిన్ సెంటర్ వద్దకు శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో వెళ్లాడు. అక్కడ డబ్బుల విష యంలో టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు మలగాన శంకరరావు, మిన్నారావు మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. అప్పటికే వారిమధ్య పాతకక్షలు ఉన్నాయి. దీన్ని మనసులో పెట్టు కొని శంకరావు కర్రతో విచాక్షణారహితంగా దాడిచేసి గాయపర్చ డడంతో మిన్నారావు మృతి చెందాడు. ఆదివారం ఉదయం రోడ్డుపక్కన మిన్నారావు మృతదేహం పడిఉండడంతో స్థానికులు కొత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. కొత్తూరు సీఐ సీహెచ్ ప్రసాద్, కొత్తూరు, హిరమండలం ఎస్‌ఐలు ఎండీ అమీరుఆలీ, ఎండీ యాసిన్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీ లించారు. క్లూస్‌టీమ్, డాగ్ స్కాడ్‌తో పరిశీలించారు. మిన్నారావు తండ్రి బుడ్డు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ఆసుపత్రికి తరలించారు. కాగా, నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు స్థానికులు చెబు తుండగా, పోలీసులు మాత్రం తమ అదుపులో ఎవరూ లేరని అంటున్నారు. చేతికి అందివచ్చిన కుమారుడు హత్యకు గురవ డంతో తల్లిదండ్రులు బుడ్డు, లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తు న్నారు. వీరికి ఓ కుమార్తె ఉన్నారు. యువకుడి హత్యతో గ్రామ స్థులు భయాందోళన చెందుతున్నారు.