Share News

టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Jun 10 , 2025 | 11:23 PM

కోదండ రామస్వామి ఆలయ వార్షికోత్సవం సందడిగా జరుగుతున్న ఆ గ్రామంలో ఓ వృద్ధురాలి హత్యతో విషాదం నెలకొంది.

టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం

టెక్కలి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): కోదండ రామస్వామి ఆలయ వార్షికోత్సవం సందడిగా జరుగుతున్న ఆ గ్రామంలో ఓ వృద్ధురాలి హత్యతో విషాదం నెలకొంది. మెడలో బంగా రం ఆభరణాలు దోపిడీ క్రమంలో ఆమెను చంపేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఈ ఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కోటబొ మ్మాళి మండలం పెద్దహరిశ్చంద్రపురంలోని కాళింగవీధిలో నివాసం ఉంటున్న దుంపల దాలమ్మ(68) మంగళవారం వేకువజామున హత్యకు గురైంది. ఆ ప్రాంతంలో ఆనవాళ్లు చూస్తే ఆమె మెడలోని బంగారం కోసమే గుర్తుతెలియని వ్యక్తులు ఈ హత్యకు పాల్పడి ఉంటారనే అనుమానం కలుగుతోంది. దాల మ్మ, ఆమె భర్త కృష్ణమూర్తి.. విశాఖ లో కుమా రుడు రామారావు దగ్గర ఉంటున్నారు. కోదండ రామాలయం వార్షికోత్సవం నేపథ్యంలో రెండు రోజుల కిందటే దాలమ్మ గ్రామానికి చేరు కుంది. ఆమె రోజూ వేకువజామున లేచి పూ లు ఏరేది. ఈ క్రమంలో మంగళవారం వేకువ జామున 4 గంటలకు ఆమె లేచింది. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె ఇంట్లోకి చొరబడి మెడలో రెండున్నర తులాల పుస్తె లతాడును దొంగిలించేం దుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పెనుగులాట జర గ్గా.. ఆమె తలపై రక్తస్రా వమై.. అక్కడికక్కడే మృతి చెందింది. వేకువజామున ఉరుములు.. మెరుపులతో వర్షం కురవగా.. ఆమె అరుపులు బయటకు వినిపించని పరి స్థితి నెలకొంది. మంగళవారం ఉదయం ఆమె విగతజీవిగా కనిపించడంతో స్థానికులు పోలీ సులకు సమాచారం అందించారు. సీఐ శ్రీనివా సరావు, ఎస్‌ఐ సత్యనారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం క్లూస్‌ టీమ్‌ను రప్పించి వివరాలు సేకరించారు. మృతురాలి కుమారుడు రామారావు ఫిర్యాదు మేరకు కోటబొమ్మాళి ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. దాల మ్మ మృతితో కుమార్తెలు నాగమ్మ, వజ్రం, భర్త కృష్ణమూర్తి రోదిస్తున్నారు. వృద్ధురాలి హత్య సమయంలో మెడలో పుస్తెలతాడు తప్ప ముక్కు, చెవికి ఉన్న బంగారు వస్తువులు చోరీ జరగలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోటబొ మ్మాళి సామాజిక ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Jun 10 , 2025 | 11:23 PM