జాతీయస్థాయి పోటీలకు ధనుష్
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:44 PM
జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ వాలీబాల్ పోటీలకు స్థానిక అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థి ఎచ్చెర్ల ధనుష్ ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తెలిపారు.
కంచిలి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ వాలీబాల్ పోటీలకు స్థానిక అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థి ఎచ్చెర్ల ధనుష్ ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తెలిపారు. తొమ్మిదో తరగతి చదువు తున్న ధనుష్ ఈ ఏడాది రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచి వెండి పతకం సాధించాడన్నారు. బుధవారం నుంచి 17వ తేదీ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రం గరుడవాడలో జరగనున్న జాతీయస్థాయి పోలీల్లో పాల్గొంటు న్నాడని తెలిపారు. 2024లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి పోటీల్లోనూ బంగారు పతకం సాధిం చాడని పేర్కొన్నారు. రాష్ట్రంలోని గురుకులాల నుంచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన ఒకే ఒక విద్యార్థి ధనుష్ కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉపాధ్యాయులు అభినందించారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలో బంగారు పతకం..
ఇచ్ఛాపురం, నవంబరు 11(ఆంధ్ర జ్యోతి): రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు తరఫున డొంకూరు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు జె.అను, ఎస్.హేమలత పాల్గొని బంగారు పతకం సాధించారని హెచ్‌ఎం జి.హేమకుమారి తెలి పారు. ఈ మేరకు మంగళవారం విద్యార్థి నులను ఉపాధ్యాయులతో కలిసి అభినందించారు. కడప జిల్లా బద్వేల్‌లో ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ కబడ్డీ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొని సత్తా చాటారన్నారు.