ఆదిత్యుని దర్శనానికి పోటెత్తిన భక్తజనం
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:40 PM
arasavalli temple ప్రత్యక్షదైవం, ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారా యణస్వామిని ఆదివారం పెద్దఎత్తున భక్తులు దర్శించుకున్నారు.
ఒక్కరోజే రూ.6.24 లక్షల ఆదాయం
అరసవల్లి, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రత్యక్షదైవం, ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారా యణస్వామిని ఆదివారం పెద్దఎత్తున భక్తులు దర్శించుకున్నారు. క్యూలైన్లు, ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. ఆదిత్యుడి అన్నదాన సత్రం వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆదివారం ఒక్కరోజు స్వామికి రూ.6,24,633 ఆదాయం లభించింది. ఇందులో టిక్కెట్ల ద్వారా రూ.3,18,800, విరాళాలు ద్వారా రూ.80,188, ప్రసాదాల వల్ల రూ.2,25,645 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.