Share News

ఆదిత్యుని దర్శనానికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - May 12 , 2025 | 12:06 AM

వైశాఖమాసం ఆదివారం ఆరోగ్యప్రదాత అరస వల్లి సూర్యనారాయణ స్వామి వారి దర్శనానికి భక్తులు పోటె త్తారు.

ఆదిత్యుని దర్శనానికి పోటెత్తిన భక్తులు
అరసవల్లిలో ఇంద్ర పుష్కరిణి వద్ద భక్తుల రద్దీ

అరసవల్లి, మే 11 (ఆంధ్రజ్యోతి): వైశాఖమాసం ఆదివారం ఆరోగ్యప్రదాత అరస వల్లి సూర్యనారాయణ స్వామి వారి దర్శనానికి భక్తులు పోటె త్తారు. ఇంద్రపుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించి, స్వామివా రికి క్షీరాన్నం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గతవారం ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, స్వామివారి దర్శనం సజావుగా సాగడానికి ఆలయ అధికారులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఒక్కరోజు స్వామివారికి రూ.12,38,049 ఆదాయం లభించింది. ఇందులో టిక్కెట్ల అమ్మకం ద్వారా రూ.8,50,600, విరాళాల ద్వారా రూ.1,63,869, ప్రసాదాల ద్వారా రూ.2,23,580 లభించినట్టు ఈవో శోభారాణి తెలిపారు.

Updated Date - May 12 , 2025 | 12:06 AM