Share News

అరసవల్లికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - May 05 , 2025 | 12:03 AM

ఆరోగ్యప్రదాత అరస వల్లి సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వైశాఖమాసం, ఆదివారం కావ డంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయాన్నే ఆలయానికి చేరుకుని స్వామివారి ఇంద్రపుష్కరిణి వద్ద క్షీరాన్నం వండి మొక్కులు చెల్లించుకున్నారు.

అరసవల్లికి పోటెత్తిన భక్తులు
ఇంద్రపుష్కరిణి వద్ద భక్తుల సందడి

అరసవల్లి, మే 4(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యప్రదాత అరస వల్లి సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వైశాఖమాసం, ఆదివారం కావ డంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయాన్నే ఆలయానికి చేరుకుని స్వామివారి ఇంద్రపుష్కరిణి వద్ద క్షీరాన్నం వండి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వా మివారిని దర్శించుకున్నారు. శనివారం నూతన ఈవోగా విధుల్లో చేరిన శోభారాణి స్వయంగా పరిశీలించి, ఏర్పా ట్లను పర్యవేక్షించారు. ఆదివారం ఒక్క రోజు స్వామి వారికి రూ.10,38,252 ఆదాయం లభించింది. ఇందులో టిక్కెట్ల ద్వారా రూ.7,36,000, విరాళాల ద్వారా రూ.98,252, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.2,04,000 లభించాయి.

10 గంటలకే ప్రసాదం లేదు..

స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ప్రసాదం లేకపోవడంతో మండిపడ్డారు. ఉదయం 10 గంటలకే లడ్డూ ప్రసాదం అయిపోవడంపై కౌంటర్‌లో ఉన్నవారి ని ప్రశ్నించారు. మధ్యాహ్నం నుంచి కొంతమంది భక్తులకు ప్రసాదం టోకెన్లు ఇవ్వకుండానే డబ్బులు తీ సుకుని నేరుగా ప్రసాదాలు ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పులిహోర ప్రసాదానికి కూడా కాసేపు భక్తులు ఎదురుచూడాల్సి వచ్చింది. దీనిపై ఆలయ అధికారులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - May 05 , 2025 | 12:03 AM