ఆదిత్యుని ఆలయానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Jul 27 , 2025 | 11:39 PM
అరసవల్లి సూర్యనారా యణ స్వామివారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారికి రూ.4,83,604ల ఆదాయం లభిం చింది.ఇందులో టిక్కెట్ల ద్వారా రూ.2,22,100లు, విరాళాల ద్వారా రూ.82,424లు, ప్రసాదాల రూపంలో రూ.1,79,080లు లభించా యి.
అరసవల్లి, జూలై 27(ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనారా యణ స్వామివారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారికి రూ.4,83,604ల ఆదాయం లభిం చింది.ఇందులో టిక్కెట్ల ద్వారా రూ.2,22,100లు, విరాళాల ద్వారా రూ.82,424లు, ప్రసాదాల రూపంలో రూ.1,79,080లు లభించా యి.కాగా ఆదిత్యుని కోల్‌కతా డెట్ రికవరీ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్, మాజీ న్యాయాధికారి అనిల్ కుమార్ శ్రీవాస్తవ, చీపురు పల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు సతీసమేతంగా ఆదివా రం దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధానార్చకులు స్వాగతం పలుకగా, అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామి వారి జ్ఞాపికను ఈవో వారికి అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఆలయ అర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మ, నేతింటి.హరిబాబు, సాందీపశర్మ పాల్గొన్నారు.