Share News

ఆదిత్యుని ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:09 PM

అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి వారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారి నుంచే ఆదిత్యుని ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఆదివారం ఒక్కరోజు స్వామివారికి రూ.8,56,135ల ఆదాయం లభించింది.ఇందులో టిక్కెట్ల అమ్మ కం ద్వారా రూ.5,24,200లు, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ. 2,04,815లు, విరాళాల ద్వారా రూ.1.08,120లు, షాపుల నుంచి ఆసీలు వసూళ్ల రూపం లో రూ.19,000లు ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో కేఎన్‌వీడీ ప్రసాద్‌ తెలిపారు.

ఆదిత్యుని ఆలయానికి పోటెత్తిన భక్తులు
జస్టిస్‌ గేదెల తుషార్‌రావుకు చిత్రపటాన్ని అందజేస్తున్న ఈవో ప్రసాద్‌:

అరసవల్లి, జూన్‌15(ఆంధ్రజ్యోతి):అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి వారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారి నుంచే ఆదిత్యుని ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఆదివారం ఒక్కరోజు స్వామివారికి రూ.8,56,135ల ఆదాయం లభించింది.ఇందులో టిక్కెట్ల అమ్మ కం ద్వారా రూ.5,24,200లు, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ. 2,04,815లు, విరాళాల ద్వారా రూ.1.08,120లు, షాపుల నుంచి ఆసీలు వసూళ్ల రూపం లో రూ.19,000లు ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో కేఎన్‌వీడీ ప్రసాద్‌ తెలిపారు. కాగా స్వామివారిని ఢిల్లీ హైకోర్టుకు చెందిన జడ్జి జస్టిస్‌ గేదెల తుషార్‌రావు దర్శించుకున్నారు.ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు స్వాగ తం పలికి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. వారికి స్వామివారి చిత్రపటాన్ని ఈవో ప్రసాద్‌ అందజేశారు. కాగా ఆలయ పరిసరాల్లో దుకా ణాలు పెట్టుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్న వారి వద్ద నుంచి షాపునకు రూ. 500లు చొప్పున సిబ్బంది ఈవో ప్రసాద్‌ ఆదేశాల మేరకు వసూళ్లు చేశారు. దీంతో కొందరు వ్యాపారులు ఈవోను కలిసి ప్రశ్నించారు.గతంలో ఇక్కడ వ్యాపారాలు చేసుకునేవారు నెలవారీ అద్దెలు చెల్లించేవారని ఈవో చెప్పారు.

Updated Date - Jun 15 , 2025 | 11:10 PM