గ్రామాల్లో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే ఎంజీఆర్
ABN , Publish Date - May 07 , 2025 | 11:55 PM
ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.
పాతపట్నం, మే 7(ఆంధ్రజ్యోతి): ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేయడమే లక్ష్య మని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నా రు. కొరసవాడ నుంచి శివరాంపురం వరకు ఉపాధి నిధులు రూ.70 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు బుధవారం శంకు స్థాపన చేశారు. దశాబ్దాల నుంచి ప్రజల కల సాకారం చేస్తామన్నారు. కార్యక్ర మంలో కూటమి నేతలు, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.
ఆర్థిక స్వావలంబనతోనే భద్రత
మహిళలకు ఆర్థిక స్వావలంబనతోనే నిజ మైన భద్రత లభిస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవింద రావు అన్నారు. స్థానిక వేంకటేశ్వర దేవాలయం సమీపంలోని సామాజిక భవ నంలో బీసీ కార్పొ రేషన్, ఈడబ్ల్యూఎస్ సం యుక్త ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. 90 రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసు కోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో పి.చంద్రకుమారి తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేకవసరాల పిల్లలను ప్రోత్సహించాలి
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు వారు ఏ రంగంలో ఆసక్తిగా ఉన్నారో గుర్తించి ప్రోత్సహించాలని ఎమ్మెల్యే మామిడి గోవింద రావు అన్నారు. స్థానిక ఎమ్మార్సీ ప్రాంగణం లోని భవిత కేంద్రంలో సమగ్రశిక్షా ద్వారా మంజూరు చేసిన ట్రైసైకిళ్లు, వాకర్ స్టాండ్ లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈవో సీహెచ్ తిరుమలరావు, ఎన్డీఏ కూటమి నేతలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.