Development works మునిసిపాలిటీలో అభివృద్ధి పనులకు శ్రీకారం
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:53 PM
Development works పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంపీల్యాడ్ నిధులు రూ.87.50 లక్షలు కేటాయించడంతో వీటితో 15 పనులను చేపట్టనున్నారు. ఈ మేరకు ఈ నెల 15న అభివృద్ధి పనులకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేయనున్నారు.

రూ.87.50 లక్షల ఎంపీల్యాడ్ నిధులు విడుదల
15న శంకుస్థాపన చేయనున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు
పలాస, మార్చి 11(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంపీల్యాడ్ నిధులు రూ.87.50 లక్షలు కేటాయించడంతో వీటితో 15 పనులను చేపట్టనున్నారు. ఈ మేరకు ఈ నెల 15న అభివృద్ధి పనులకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మునిసిపల్ కార్యాలయంలో కమిషనర్ ఎన్.రామారావుతో టీడీపీ నాయకులు చర్చిం చారు. ఎంపీల్యాడ్ నిధులు గతంలోనూ కేటాయించగా నాడు రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పను ల్లో జాప్యం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావ డంతో ఎంపీల్యాడ్ నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఏయే పనులు చేపడతారంటే..
మంజూరైన ఎంపీల్యాడ్ నిధులతో పట్టణంలోని 14, 19, 22, 24, 25, 27, 28వ వారుల్లో బోర్‌వెల్స్, 29 వార్డులో సీసీ కాలువ, 7, 16, 17, 18 వార్డుల్లో సీసీ రోడ్లు, 4, 7 వార్డుల్లో కమ్యూ నిటీ హాళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ పనులకు సంబం ధించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ నుంచి మునిసిపల్ అధికారులకు ఆదేశాలొచ్చాయి. ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపలతో పాటు కిడ్నీ పరిశోధన కేంద్రానికి ఎన్‌ఆర్‌ఐలు ఇచ్చిన ఐదు డయాలసిస్ యూనిట్లను మంత్రులు ప్రారంభించనున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. వీటికి సంబంధించి రోడ్ మ్యాప్‌ను రూపొం దించారు. కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లొడ గల కామేశ్వరరావు యాదవ్, జిల్లా ప్రధాన కార్య దర్శి పీరుకట్ల విఠల్‌రావు, గురిటి సూర్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు సప్ప నవీన్, కొరికాన శంకర్, సవర రాంబాబు, దడియాల నర్సింహులు, డొక్కరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.