కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:37 PM
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ నాయకులు తెలిపారు. బుధవారం జిల్లాలోని పలుచోట్ల తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

ఫరాజాం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): పట్టణ, గ్రామీణ రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ తెలిపారు. రాజాం మునిసిపాలిటీలోని తెగవీఽధిలో టీడీపీ పట్టణాధ్యక్షుడు నంది సూర్యప్రకాష్‌రావు అధ్యక్షతన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు.
ఫనెల్లిమర్ల, జూలై 30(ఆంధ్రజ్యోతి): మండలంలోని వల్లూరు, మల్యాడ, తమ్మాపురంల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిశీలకుడు సువ్వాడ రవిశేఖర్, జిల్లా అధికార ప్రతినిది గేదెల రాజారావు, పార్టీ నాయ కులు పంచాది సూరినాయుడు, పోతల రాజప్పన్న, పంచాది జగన్, గురాన రామారావు, లెంక సన్యాసిరావు, మొంగం శ్రీను, లంక పైడినా యుడు, పైడి మల్లేష్, పున్నాన రమణ, పాపినాయుడు పాల్గొన్నారు.
ఫమెరకముడిదాం,జూలై 30(ఆంధ్రజ్యోతి):మండలంలోని వూటపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగుకార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో తాడ్డి సన్యాసినాయుడు, కోట్ల మోతీలాల్‌నాయుడు, తాడ్డి చంద్రశేఖరరెడ్డి, ఆనంద్, చల్లా శ్రీరామ్ పాల్గొన్నారు.