Share News

రోడ్ల నిర్మాణంతో అభివృద్ధి: ఎమ్మెల్యే రవికుమార్‌

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:29 PM

రోడ్ల నిర్మాణంతో రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పీ యూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రకుమార్‌ అన్నారు.

రోడ్ల నిర్మాణంతో అభివృద్ధి:  ఎమ్మెల్యే రవికుమార్‌
శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

పొందూరు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రోడ్ల నిర్మాణంతో రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పీ యూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రకుమార్‌ అన్నారు. లోలుగు నుంచి వీఆర్‌గూడెంకు వరకు, రెడ్డిపేట నుంచి మూడు మర్రి చెట్ల వరకు నిర్మించిన బీటీ రోడ్లను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాల్లో రోడ్లు ముఖ్య మన్నారు. కూటమి ప్రభుత్వం రోడ్ల నిర్మా ణానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందని, అటవీ ప్రాంతా ల్లోనూ రోడ్ల నిర్మాణం చేపడుతోం దన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు వండా న మురళి, తెలుగుయువత జిల్లా ప్రధాన కార్యదర్శి బలగ శంకరభాస్కర్‌, పీఎసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కూన సత్యనారా యణ, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఎ.రాము, ఆర్‌అడ్‌బీ ఎస్‌ఈ పి.సత్యనారాయణ, ఈఈ ఎ. తిరు పతిరావు, డీఈ గణపతిరావు, ఏఈ పీటీ రాజు, ఎంపీడీవో సింహాచలం, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 11:29 PM