పర్యాటకంగా రాజులచెరువు అభివృద్ధి :ఎమ్మెల్యే
ABN , Publish Date - Dec 17 , 2025 | 11:52 PM
స్థానిక రాజులచెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన డీపీఆర్‌ను సిద్ధం చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆర్డీవో సాయిప్రత్యూష ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
నరసన్నపేట, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): స్థానిక రాజులచెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన డీపీఆర్‌ను సిద్ధం చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆర్డీవో సాయిప్రత్యూష ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2017 తరువాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించి గట్టుమీద ఫెన్సింగ్, అవుట్‌లెట్, ఇన్‌లెట్‌లు, మురుగునీరు మళ్లింపు. వాకింగ్ ట్రాక్, సోలార్ లైట్ల ఏర్పాటుకు ఇంజనీరింగ్ శాఖ అధికారులు అంచనాలు సిద్ధం చేయాలన్నారు. పంచాయతీ, రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో అక్రమ నిర్మాణాలను తొలగించాలన్నారు. ఈ సమావేశంలో తహసీలార్ సత్యనారాయణ, ఎమ్పీడీవో వెంకటేష్ ప్రసాద్, పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు సత్యంనాయుడు, నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.