కొత్తమ్మతల్లి ఆలయం అభివృద్ధి
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:04 AM
కొత్తమ్మతల్లి ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు తెలిపారు. సోమవారం కొత్తమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో అధి కారులు, గ్రామపెద్దలు, ప్రజలతో సమావేశం నిర్వహించారు.
కోటబొమ్మాళి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కొత్తమ్మతల్లి ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు తెలిపారు. సోమవారం కొత్తమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో అధి కారులు, గ్రామపెద్దలు, ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మతల్లికి ఆనుకొని ఉన్న మండపం, భోజనశాలతొలగిస్తామని తెలిపారు.అమ్మవారి విగ్రహం చుట్టూ విస్తరణ పెంచి అభివృద్ధిచేస్తామన్నారు.నూతనంగా యాగశాల, పాకశాల, కార్యాల యం, క్షౌరశాల,తదితర నిర్మాణాలు చేపడతామన్నారు.పక్కనే ఉన్న పీఏ సీఎస్ కార్యాలయాన్ని అమ్మవారి ఆలయ ఆధీనంలోకి తీసుకుని మండల పరిషత్ సమీపంలో స్థలం కేటాయించడంపై ఆర్డీవో కృష్ణమూర్తికి ఆదేశాలు జారీ చేశారు. ఆలయం పక్కన స్థలాన్ని స్వచ్ఛందంగా ఇచ్చిన సుసరాపు సూరిబాబుకు, సర్గీయ పట్నాయకుని వెంకటేశ్వరరావు కుమా రుడు రమణమూర్తిలకుఅభినందించారు. స్థలదాత రమణమూర్తి మాట్లా డుతూ అమ్మవారి ఆలయానికి కావాల్సి తమస్థలాన్ని దేవదాయఽ ధర్మాదా యశాఖకు రిజిస్టేషన్ చేస్తామని తెలిపారు. రాష్ట్రస్థాయి స్థపతి పరమేశ్వ రప్ప మాట్లాడుతూ అమ్మవారిఆలయం ప్రాంగణంలో 15 అభివృద్ధి కార్య క్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. వారం వ్యవధిలో దీనికి సంబం దించిన డిజైన్లు మంత్రికి చూపిస్తామని చెప్పారు.కొత్తమ్మతల్లి పాలకమం డలి అధ్యక్షుడు కోరాడ గోవిందరావు ఆలయ అభివృద్ధికి రూ. మూడు లక్షలు విరాళంగా అందజేస్తానని తెలిపారు.గ్రామపెద్దలు తంగుడు కృష్ణ స్వామి,కల్లి లక్ష్మణరెడ్డి, కల్లి నాగయ్యరెడ్డి, రాష్ట్ర కళింగ కోమటి అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, టీడీపీ మండలాధ్యక్షుడు బోయిన రమేష్‌లు అమ్మవారి ఆలయ అభివృద్ధికి పలు సూచనలు ఇ చ్చారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహధికారి వాకచర్ల రాధాకృష్ణ, తహసీల్దార్ అప్పలరాజు, ఇన్‌చార్జీ ఎంపీడీవో నారాయణరావు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరిప్రసాద్, పీఏసీఎస్ అధ్యక్షురాలు వెలమల విజయలక్ష్మి, కామేశ్వరావు,ఏఎంసీ ఉపాఽధ్యక్షురాలు బాడాన వెం కటరమణమ్మ, సాసుమంతు ఆనందరావు, నంబాళ శ్రీనివాస్, కర్రి అప్పా రావు, తర్ర రామకృష్ణ పాల్గొన్నారు. కాగా కళింగ కోమటి కార్పోరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు సోమవారం స్థానిక ఎన్టీఆర్ భవనం లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు కలిశారు.