కూటమితోనే అభివృద్ధి సాధ్యం
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:47 PM
Devolopment works కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
అరసవల్లి/ పాత శ్రీకాకుళం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి) ః కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శనివారం ఆయన శ్రీకాకుళం మండలంలోని చాపురం, పాత్రునివలసతోపాటు పీఎస్‌ఎన్‌ఎం పాఠశాల ఎదురుగా కోలనీలో పలు రోడ్లు, కాలువల నిర్మాణానికి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి శంకుస్థాపనలు చేశారు. డీసీసీబీ కోలనీలో రూ.15లక్షలతో నిర్మించిన దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు పార్కును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో రూ.28.17లక్షల సీసీ రోడ్ల నిర్మాణం, చాపురంలో రూ.16లక్షల నిధులతో సీసీ రోడ్డు, కాలువల నిర్మాణం చేపట్టాం. ఇందిరానగర్ కాలనీలో రోడ్డును ప్రారంభించామ’ని తెలిపారు. మిర్తిబట్టిని పరిశీలించి, మురుగునీరు సక్రమంగా ప్రవహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీవో కె.సాయిప్రత్యూష, కార్పొరేషన్ కమిషనర్ ప్రసాదరావు, ఇంజినీర్లు, సీనియర్ టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.