నీటి వనరులతోనే అభివృద్ధి
ABN , Publish Date - May 15 , 2025 | 12:00 AM
నీటి వనరులతోనే అభివృద్ధి జరుగుతుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ఉద్దానం ప్రాజెక్టు నుంచి పట్టణానికి నీరందిస్తున్నట్లు చెప్పారు.బుధవారం కాశీబుగ్గలో ఉద్దానం మంచి నీటి ప్రాజెక్టు ద్వారా పట్టణానికి నీరం దించేందుకు రూ.63లక్షలతో నిర్మించిన సింధూరజలసిరిని ప్రారంభించారు.
కాశీబుగ్గ, మే 14 (ఆంధ్రజ్యోతి): నీటి వనరులతోనే అభివృద్ధి జరుగుతుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ఉద్దానం ప్రాజెక్టు నుంచి పట్టణానికి నీరందిస్తున్నట్లు చెప్పారు.బుధవారం కాశీబుగ్గలో ఉద్దానం మంచి నీటి ప్రాజెక్టు ద్వారా పట్టణానికి నీరం దించేందుకు రూ.63లక్షలతో నిర్మించిన సింధూరజలసిరిని ప్రారంభించారు.ఈసందర్భం గా ఆమెమాట్లాడుతూ గతప్రభుత్వంలో మాజీమంత్రి సీదిరి అప్పలరాజు మంత్రి హోదా లో ఉన్నా వంశధార నీరు శివారు భూములకు అందించలేకపోయారని, కనీసం మునిసి పాలిటీకి తాగునీరు ఇవ్వలేకపోయారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా సాగు, తాగు నీరందించినప్పుడు నాలుగేళ్లు మంత్రిగా ఉండి ఎందుకు పనులు చేయలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. మాజీ మంత్రి గౌతు శివాజీ మాట్లాడుతూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు శ్వేతపత్రం అంటే తెలియదన్నారు.అనంతరం మునిసిపల్ అధికా రులు గౌతు శిరీష, శివాజీ, చైర్మన్ బల్ల గిరిబాబుకు సన్మానించారు.కార్యక్రమంలో ము నిసిపల్ కమిషనర్ రామారావు,టీడీపీ నాయకులు లొడగల కామేశ్వరరావు, సూర్యనారా యణ, గాలి కృష్ణారావు, నాగరాజు, సప్పనవీన్,దువ్వాడ శ్రీకాంత్, శంకర్, చిన్ని, మల్లేశ్వ రరావు,మల్లా శ్రీనివాస్‌రావు, రామకృష్ణ, దేవా, నర్సింహులు, కృష్ణారావు పాల్గొన్నారు.
సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలి
ప్రతి ఒక్కరూ సొంతింటి కల సాకారం చేసుకోవాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు. బుధవారంకాశీబుగ్గ ఉన్నత పాఠశాల ఆవరణలో సుడా ఆధ్వర్యంలో పలాస మండలంలోని బొడ్డపాడు ఎంఐజీ లేఅవుట్-2లోని ప్లాట్లను లాటరీ పద్ధతిలో కేటాయింపు ప్రక్రియను ప్రారంభించారు. సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఈఈ సుగుణా కరరావు, సుడాపీవో అమర్‌నాఽథ్, ఏపీవో కృష్ణ, జేపీవోశాస్ర్తి, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ మోహన్, వెంకటేష్,సుడా సెక్రటరి లక్ష్మి పాల్గొన్నారు.