Share News

central minister : పోర్టు నుంచి పార్క్‌ వరకు అభివృద్ధి

ABN , Publish Date - May 08 , 2025 | 11:52 PM

Port Park Development మూలపేట పోర్టు నుంచి మెళియాపుట్టి ఇండస్ట్రీయల్‌ పార్క్‌ వరకు అన్నీ అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. గురువారం మెళియాపుట్టిలో సుమారు 6.28కోట్ల వ్యయంతో 65 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ ఇండస్ర్టీయల్‌ పార్క్‌ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.

central minister : పోర్టు నుంచి పార్క్‌ వరకు అభివృద్ధి
మెళియాపుట్టిలో ఇండస్ట్రీయల్‌పార్క్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

  • కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు

  • మెళియాపుట్టి, మే 8(ఆంధ్రజ్యోతి): మూలపేట పోర్టు నుంచి మెళియాపుట్టి ఇండస్ట్రీయల్‌ పార్క్‌ వరకు అన్నీ అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. గురువారం మెళియాపుట్టిలో సుమారు 6.28కోట్ల వ్యయంతో 65 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ ఇండస్ర్టీయల్‌ పార్క్‌ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మూలపేట నుంచి మెళియాపుట్టి వరకు రహదారులు విస్తరణ చేస్తే మరిన్ని పెట్టుబడులు వస్తాయి. ఉద్యోగ కల్పన ఉద్యమం కొనసాగుతోంది. దీనికి ప్రతిఒక్కరూ సహకరించాలి. ప్రతీ నియోజకవర్గంలోనూ ఒక ఇండస్ర్టీయల్‌ పార్క్‌కు భూములు కేటాయిస్తే.. భవిష్యత్‌లో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇంటికొక పారిశ్రామిక వేత్తను తయారు చేస్తాం. రాష్ట్రంలోనే పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉండడం విచారకరం. పరిశ్రమల ఏర్పాటుతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. మెళియాపుట్టిలో డోలీమోతలు లేకుండా రహదారుల పనులు చేపడతాం. మెళియాపుట్టిలోనే ఐటీడీఏ ఏర్పాటు చేస్తామ’ని తెలిపారు. అంతకుముందు సంతలక్ష్మీపురం - గంగన్నపేట, గొడ్డ జంక్షన్‌ నుంచి అనంతగిరి, రింపి వరకు, కూర్మన్నపేట - కోత్తపేట రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, టెక్కలి ఆర్డీవో కృష్టమూర్తి, తహసీల్దార్‌ పాపారావు, ఎంపీడీవో ప్రసాద్‌పండా, మాజీ ఎంపీపీలు సలాన మోహనరావు, బి.లక్ష్మీనారాయణ, టీడీపీ నాయకులు బి.దినకర్‌రావు, భాస్కర్‌గౌడో, రాజశేఖరెడ్డి, పరమేష్‌రెడ్డి, సర్పంచ్‌లు బమ్మిడి భాస్కరరావు, ఆర్‌.లక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 11:52 PM